అలరించిన తాళం భజన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేది కపై శనివారం శ్రీ భువనేశ్వరమ్మ భజన సమాజం అప్పాపురం వారు నిర్వహించిన తాళం భజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ పాలకమండలి సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి తిరుప్పావైలోని 26వ పాశురంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అనంతరం గాజుల సుశీలమ్మ, మాధవి, మంగమ్మ, వెంకాయమ్మ, శైలమ్మ, చంటి అమ్మ, రమణమ్మ తమ గాత్ర ధారణలో పలు వేంకటేశ్వరస్వామి, శివుడు, శ్రీకృష్ణుడు, అమ్మవార్ల కీర్తనలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించారు. డోలక్పై వై శివశంకర్ వాయిద్య సహకారం అందించారు.






కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి