భక్తిశ్రద్ధలతో మహా చండీయాగ పూర్ణాహుతి స్థానిక బృందా వన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్, వేంకటేశ్వరస్వామి దేవాలయ పాలక మండలి సంయుక్త ఆధ్వర్యంలో విశ్వశాంతి, రాజధాని అమరావతి అభివృద్ధి, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ గత 14 రోజులుగా నిర్వహిస్తున్న చండీహోమం సోమవారం మహా పూర్ణాహుతి జరిపారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్వవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో లక్ష్మి మహాగణపతికి, నవగ్రహాలకు, రుద్రుడికి అభి షేకాలు, అర్చనలు చేశారు. కలశపూజ, లక్ష్మీగణపతి, రుద్ర, చండీహోమం, 108 రకాల హోమద్రవ్యాలతో మహాపూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు పుట్ట గుంట ప్రభాకరరావు, ఊటుకూరి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా దీపోత్సవం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై టీటీడీ దేవస్థానం ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ సౌజన్యంతో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శని వారం దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత పాలక మండలి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీపోత్సవంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లంకా విజయ బాబు, ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
.jpeg)




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి