భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ సౌజన్యంతో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శు క్రవారం సామూహిక కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి తిరుప్పావై 18వ విశేష పాశురం ఉదుమదగళిత్త పై ప్రవచిస్తూ నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను, గోపికలు తెరువకపోవుటచేత అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమని గోదాదేవిని ప్రార్ధించారన్నారు. పాశురంలోని విశేష అంశాలను విశ్లేషించి చెప్పి, దానికి అనుబంధంగా సువాసినులచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.


.jpeg)





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి