వాయులీన కళానిధి దుర్గాభవానికి గాయత్రీ సంగీత విద్వన్మణి బిరుదు ప్రధానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ గుంటూరు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి అధ్యక్షురాలు డాక్టర్ పీ. విజయ, ప్రధాన కార్యదర్శి ఏం. వై. శేషురాణి పర్యవేక్షణలో సంగీత కళా కౌముది విదుషి బీ.వీ. దుర్గాభవానికి బిరుప్రధాన సభ జరిగింది. కార్యక్రమాలను ముఖ్య అతిధి, సంపాదకులు గాన కళ మునుగంటి వెంకట్రావు, ఆత్మీయ అతిధి విశ్వ సంకీర్తనాచార్య తుర్లపాటి శయంభయాచారి, సన్మాన కర్త వీ. అరుణ, విద్యాసాగర్, గోపరాజు దుర్గాకుమారి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అతిధులు, సంస్థ వారు సన్మాన గ్రహీత వాయులీన కళానిధి బీ.వీ. దుర్గా భవానీని గాయత్రీ సంగీత విద్వన్మణి బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిధి మాట్లాడుతూ సంగీతంతో మనోబలం, ప్రశాంతత లభిస్తాయని అన్నారు. ఇటువంటి విశిష్ట కళాకారులను ఎంతో మందిని సత్కరించటం, అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న గాయత్రీ మహిళా మండలి వారిని అభినందించారు. సభానంతరం దుర్గా భావాన్ని వాయులీన సోలో కచేరీ శ్రావ్యంగా సాగింది. వీరికి మృదంగం పై కే. సద్గురుచరణ్, ఘటం పై ఏం. హరిబాబు, సంస్థ ప్రధాన కార్యదర్శి ఏం.వై. శేషురాణి, ఉపాధ్యక్షులు మాధవపెద్ది మీనాక్షి, డాక్టర్ రాజరాజేశ్వరి, పాటిబండ లలిత, కార్యదర్శి ఏ.వీ.మంగాదేవి, మాధవపెద్ది మాధవీకృష్ణ, కోశాధికారి మాధవపెద్ది విజయలక్ష్మి అతిధులను, కళాకారులను సత్కరించారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి