అలరించిన భక్తిగీతాలాపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం శ్రీ వాగ్దేవి బృందగాన సమితి, గుంటూరు వారిచే భక్తిగీతాలాపన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయనీమణులు ఎస్. గీత, ఎం. భాగ్యలక్ష్మి, ఉషారాణి, శ్యామల, మాధవి, శోభ, విజయలక్ష్మి లు తమ గాత్రధారణలో గోపాలకృష్ణ పాహీ, పద్మావతి రమణి పాహీ, నారాయణ సకుల బ్రహ్మణే అంటూ పలు భక్తిగీతాలను ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. మృదంగంపై కిషోర్, వయోలిన్ పై సిహెచ్. శ్రీనివాస్ వాయిద్య సహాకారం అందించారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి