వైభవంగా సహస్ర కలశాభిషేకం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీకంచికామకోటి పీఠ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం చాతుర్మాసం, స్వామి వారి తిరున క్షత్రం సందర్భంగా పంచామృతాభిషేకం, సహస్ర కలశాభిషేకం ఆలయ ప్రధాన పూజారి మాధవాచార్యుల బృందం వేద మంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో జరగ్గా, సుమారు 500 కల శాలకు విశేష పూజలు చేపట్టారు. అభిషేక పూజలో భక్తులు పాల్గొనగా, మేళతాళాలతో ప్రదక్షిణలు చేసి ఆలయంలోకి ప్రవేశించారు. విశేష హారతి అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు, అభిషేకాల్లో పాల్గొన్న వారికి కలశం ప్రత్యేక ప్రసాద వితరణ చేశారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు,ఉపాధ్యక్షుడు విజయబాబు పాల్గొన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి