అలరించిన భక్తి సంగీత విభావరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం సాయంత్రం మహతీ స్వరసుధ భక్తి సంగీత విభావరి నిర్వ హించారు. మహతీ స్వరసుధ వ్యవస్థాపక అధ్యక్షురాలు పత్రి నిర్మల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని బండ్లమూడి విజయలక్ష్మి, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. గాయనీ, గాయకులు రాజ్యలక్ష్మి, జరీనా, చాందిని, మదురిత, ప్రహర్షితా, ప్రసన్నలక్ష్మి, చిరంజీవి తదితరులు సినీ భక్తి గీతాలను అలపించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యతగా వ్యవహరించగా, మదన్మోహన్రావు పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి