అయ్యంకి- వెలగా పురస్కార ప్రదానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం
అన్నమయ్య కళావేదికపై అన్నమయ్య సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యంకి-వెలగా
పురస్కారాల ప్రదానోత్సవ సభ జరిగింది. తొలుత గ్రంథాలయ పితామహుడు అయ్యంకి
వేంకటరమణయ్య, గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగా వెంకటప్పయ్య చిత్రపటాలకు అతిధులు పూలమాలలు వేసి
నివాళ్ళులు అర్పించారు. గాయకుడు వేల్చూరి శివనాగమల్లేశ్వరారావు అన్నమయ్య సంకీర్తనల
గానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య
అధ్యక్షత వహించారు. అతిథులుగా ఎం.ఎల్.సి.
ఆలపాటి రాజేంద్రప్రసాద్, జె.ఎన్.టి.యు. పూర్వ ప్రొఫెసర్ ఆచార్య అయ్యంకి
మురళీకృష్ణ, వివా ది స్కూల్ గ్రంథపాలకులు వెలగా మానవేంద్ర, సంస్థ కన్వీనర్
పావులూరి శ్రీనివాసరావు, అన్నమయ్య గ్రంథాలయం గ్రంథాలయాధికారి ఎన్. సుభాషిణి తదితరులు
పాల్గొని పురస్కార గ్రహీతలు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు లైబ్రరీ
ఇన్ఫర్మేషన్ సైన్సెస్ డాక్టర్ డి. చంద్రన్, విశ్రాంత అధ్యాపకులు, సాహితీవేత్త
డాక్టర్ బీరం సుందరరావు లను రూ. పదివేల నగదుతోపాటు గ్రంథాలయ సేవా పురస్కారాలతో
ప్రదానం చేశారు. అనంతరం ప్రొఫెసర్ కౌలా ధార్మికోపన్యాసం నేటి తరుణంలో పుస్తక
భవితవ్యం అంశంపై పురస్కార గ్రహీతలు మాట్లాడారు. నిర్వాహకులు అతిధులను ఘనంగా
సత్కరించారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి