సామాజిక చైతన్యానికి జాషువా ఎనలేని కృషి
గుర్రం జాషువాను చిరస్మరణీయుడుగా నిలిపింది ఆయన పద్యరచన అని, ఆ పద్యం అంత విశిష్టమైనదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద గురువారం రాత్రి కవికోకిల గుర్రం జాషువా వర్ధంతి సభ జరిగింది. కళా స్రవంతి సాహితీ సాంసృతిక సంస్థ అధ్యక్షుడు దేవరపల్లి ప్రభుదాస్ సభకు అధ్యక్షత వహించారు. తొలుత జాషువా చిత్రపటానికి పులమాలు వేసి నివాళులు అర్పించారు. - ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత జాయింట్ రిజిస్ట్రార్ వాసా మాణిక్యాలరావు సభకు అతిథులను పరిచయం చేశారు. ముఖ్యఅతిథి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లా డుతూ జాషువా సామాజిక చైతన్యం కోసం చేసిన కవితా పోరాటం ఎందరికో స్ఫూర్తిని చ్చిందన్నారు. ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు పి.వరప్రసాదమూర్తి ప్రసంగించారు. సభానం తరం దేవరపల్లి ప్రభుదాస్, అల్లాబక్షు, వై.గంభీర్లు జాషువా పద్యాలను ఆలపించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి