ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నాటకరంగానికి కావూరి సేవలు ప్రశంసనీయం - 21.07.2026

నాటకరంగానికి కావూరి సేవలు ప్రశంసనీయం నాటక, సాహిత్య రంగానికి కావూరి సత్యనారాయణ చేసిన సేవలు ప్రశంసనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పద్మావతి కల్యాణ మండపంపై ఆరాధన ఆర్ట్స్ ఆధ్వర్యంలో మంగళ వారం ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు కావూరి సత్యనారాయణ రచించిన 15 నాటికల సంపుటి ఆవిష్కరణ సభ జరి గింది. పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నాటక, రచన రంగంలో దాదాపు 400కు పైగా పురస్కారాలు అందుకున్న కావూరి సత్యనారాయణ తనకు మిత్రుడవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ నాటక రంగా న్ని, కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోం దన్నారు. గతంలో వారికి రావాల్సిన ప్రోత్సహాకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. కావూరి సత్యనారాయణ స్పూర్తితో మ రింత మంది యువ రచయితలు ముందుకు రావాలని ఆకాంక్షిం చారు. అనంతరం కావూరి సత్య...

నాటకరంగానికి కావూరి సేవలు ప్రశంసనీయం - 21.07.2026

నాటకరంగానికి కావూరి సేవలు ప్రశంసనీయం

నాటక, సాహిత్య రంగానికి కావూరి సత్యనారాయణ చేసిన సేవలు ప్రశంసనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పద్మావతి కల్యాణ మండపంపై ఆరాధన ఆర్ట్స్ ఆధ్వర్యంలో మంగళ వారం ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు కావూరి సత్యనారాయణ రచించిన 15 నాటికల సంపుటి ఆవిష్కరణ సభ జరి గింది. పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నాటక, రచన రంగంలో దాదాపు 400కు పైగా పురస్కారాలు అందుకున్న కావూరి సత్యనారాయణ తనకు మిత్రుడవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ నాటక రంగా న్ని, కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోం దన్నారు. గతంలో వారికి రావాల్సిన ప్రోత్సహాకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. కావూరి సత్యనారాయణ స్పూర్తితో మ రింత మంది యువ రచయితలు ముందుకు రావాలని ఆకాంక్షిం చారు. అనంతరం కావూరి సత్యనారాయణను అతిథులు ఘనంగా స త్కరించారు. సభలో పాల్గొన్న అజో విభో కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణను సంస్కృతి బాల అవార్డుతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేదిక అధ్యక్షుడు ముత్తవరపు సురేశ్ బాబు, సినీనటుడు నాయుడు గోపి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, సాహితీవేత్త డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.