నారద భక్తిసూత్రాలు పై ప్రవచనము
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై మంగళవారం నారద భక్తిసూత్రాలు పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రహ్మశ్రీ మల్లాది కైలాసనాధ్ ప్రవచిస్తూ అసలు భక్తి అంటే ఏమిటి? నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు? మొదలైన విషయాలు నారద భక్తిసూత్రాల రూపంలో మనకు చక్కగా తెలియజేస్తాయన్నారు. భక్తి అంటే పరమ ప్రేమ అని నారద మహర్షి చెప్పారన్నారు. పరమ ప్రేమ అంటే ప్రయోజనాన్ని ఆశించని ప్రేమ అన్నారు. నిజమైన భక్తుడు భగవంతుని ఏమీ కోరడన్నారు. వివేకానంద స్వామి తన జీవితంలో చాలా పేదరికం అనుభవించే రోజులలో కూడా అమ్మవారిని తన పేదరికం తొలగించమని కోరలేదన్నారు. నిజమైన వ్యక్తి ఎవరినీ ద్వేషింపడు, అంతటా భగవంతుడినే చూస్తాడని నారద భక్తిసూత్రాల ఇతివృత్తాంతాన్ని భగవత్ భక్తులకు తెలియజేశారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి