మహాభారతంపై ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం మహా భారతంలోని విరాటపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మిక వేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ ద్రౌపది అసాధారణ సౌందర్యాన్ని చూసి రాణి సోదరుడు, సర్వసైన్యాధ్యక్షుడైన కీచకుడు తీవ్రమైన మోహానికి గురవుతాడ న్నారు. ద్రౌపది తన భర్తలు గంధర్వులని, నన్ను తాకవద్దని ఎంత హెచ్చరిం చినా మదాంధుడైన కీచకుడు వినకుండా, రాజసభలోనే ఆమెను కాలితో తన్ని తీవ్రంగా అవమానిస్తాడన్నారు. ద్రౌపది రహస్యంగా భీముడిని కలిసి తన బాధను వెళ్లబోసుకుంటుందన్నారు. అక్కడ ద్రౌప దిలా ముసుగు తన్నుకుని వేచి ఉన్న భీముడు, కీచకుడితో భయంకరమైన మల్లయుద్ధం చేసి అతడి అవయవాలను విరిచి దారుణంగా సంహరిస్తాడన్నారు.
.jpeg)



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి