కనుల పండువగా జగన్నాథ రథయాత్ర స్థానిక హరే కృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో శనివారం జగన్నాథుని రథయాత్ర భక్తిశ్రద్ధలతో సాగింది. హరే కృష్ణ.. జై కృష్ణ నామస్మరణతో భక్తులు పులకరించి పోయారు. యాత్రలో భక్తులు నామ సంకీర్తన, కోలాట ప్రదర్శనలు చేశారు. ఈ యాత్ర నవభారత్ నగర్, సూర్యదేవర కల్యాణ మండపం నుంచి ప్రారంభమై కొరిటెపాడు, లక్ష్మీపురం మీదగా సాగి బృందావన్ గార్డెన్స్, శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ముగిసింది అనంతరం స్వామి వారికి మంగళహారతి, మహాప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.
అలరించిన భక్తి సంగీత విభావరి
స్థానిక బృందావన్
గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై స్వరరాగసుధ
ఆధ్వర్యంలో శనివారం జరిగిన భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత
ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు
జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయకులు కటకరాజు వెంకట
సాయిబాబా శర్మ బృందం తమ గాత్రధారణలో పలు భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించారు.
కీబోర్డుపై లక్ష్మణ్, తబలపై సాయిరామ్ మహేష్ వాయిద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా
ఆలయ కమిటి సభ్యులు కళాకారులను ఘనంగా సత్కరించారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి