యమ, నచికేతుల సంవాదమే కఠోపనిషత్తు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై నిర్వస్తున్న ఉపనిషత్ స్రవంతిలో కఠోపనిషత్ పై ఆధ్యా త్మిక ప్రవచనాలు శుక్రవారం ముగిశాయి. బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్మయమిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ యముడు నచికేతుడిని ప్రాపంచిక సుఖాలు, సంపదలతో ప్రలోభపెట్టిన, అతను వాటన్నింటినీ తిరస్కరించి కేవలం ఆత్మజ్ఞానం కోసమే పట్టుబడతాడని అన్నారు. నచికేతుని వైరాగ్యానికి, జిజ్ఞాసకు సంతోషించిన యముడు శరీరం ఒక రథమైతే, ఆత్మ అందులోని రథికుడని వివరిస్తూ, జనన మరణాలు లేని నిత్యమైన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడని పేర్కొన్నారు.
.jpeg)




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి