జీవాత్మ.. పరమాత్మ తత్వాన్ని వివరించేది కఠోపనిషత్తు
జీవాత్మ.. పరమాత్మ తత్వ నిరూపణం చేసే విశేష ఉపనిషత్తే కఠోపనిషత్తు అని చిన్మయా మిషన్ సువీరా నంద స్వామి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం బండ్ల మూడి విజయలక్ష్మి సౌజన్యంతో ఉపనిషత్ స్రవంతిలోని కఠోపని షత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్, మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయ మిషన్ బ్రహ్మనాని సువీరానందస్వామి ప్రవచిస్తూ కఠోష నిషత్తులోని జీవాత్మ పరమాత్మల స్వరూపం, మరణానంతర రహస్యం ప్రధాన ఇతివృత్తం అంటారన్నారు. వాజశ్రవసుడు అనే మహర్షి విశ్వజిత్ యాగం చేస్తూ, పనికిరాని, ముసలి ఆవులను దానమిస్తుండటం చూసి, అతని కుమారుడైన వచికేతుడు. బాధపడతాడన్నారు. తండ్రికి పాపం చుట్టుకోకూడదనే సద్బుద్ధితో నన్ను ఎవరికి దానమిస్తావు? అని పదే పదే ప్రశ్నిస్తార న్నారు. తండ్రి కోపంతో నిన్ను మృత్యువుకు ఇస్తున్నాను అని పలుకుతా డన్నారు. పితృవాక్య పరిపాలన కోసం నచికేతుడు యమలోకానికి వెళ్తాడన్నారు. సమయంలో యమధర్మరాజు అక్కడ లేకపోడ డంతో, నచికేతుడు మూడు రాత్రులు ఆహారపానీ యాలు లేకుండా యముని వాకిట వేచి ఉంటాడన్నారని భగవత్ భక్తులకు తెలియజేశారు.
.jpeg)





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి