ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భక్తిశ్రద్ధలతో చండీహోమం - 12.07.2026

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భార తీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మాసశివరాత్రి సందర్భంగా ఆదివారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధల తో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు 9 మంది వేద పండితుల ఆధ్యర్యంలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు.

అలరించిన కర్ణాటక సంగీత కచేరి - 12.07.2026

అలరించిన కర్ణాటక సంగీత కచేరి

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై ఆదివారం నిర్వహించిన కర్ణాటక సంగీత కచేరి ప్రేక్షకులను అలరింపజేసింది. హైదరాబాద్ కు చెందిన శ్రీ శేషసాయి సంగీత అకాడమి ఆధ్వర్యంలో త్యాగరాజ కృతి మణిమాల పేరుతో ఈ కార్య క్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంగీత విద్వాంసురాలు డాక్టర్ తాతా గిరిజా శేషమాంబ శిష్యబృందం త్యాగరాజ స్వామి కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. వయోలిన్పై చావలి శ్రీనివాస్, మృదంగంపై ఆనంద్, వీణపై యిమ్మడి అంజనీదేవి వాయిద్య సహకారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని యిమ్మడి అంజనీదేవి, మల్లికార్జునరావు పర్యవేక్షించారు






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.