శాస్త్రీయ సంగీతాన్ని ముందుతరాలకు అందించాలి
భారతీయ వారసత్వ శాస్త్రీయ సంగీత జ్ఞాన సంపదను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. గుంటూరు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో మంగ కంపల్లి జయంతి ఉత్సవ సభ శనివారం రాత్రి బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కల్యాణవేదికపై జరిగింది. సభలో జస్టిస్ బి. కృష్ణమోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి మహోన్నత సంగీత గురువులు దేశ సాంస్కృతిక రంగాన్ని సుసంపన్నం చేశారన్నారు. వారి వారసత్వాన్ని కొనసాగించేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. గుంటూరులో బాలమురళీకృష్ణ పేరున ఉన్న ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలను కళాశాల స్థాయికి పెంచడం అవసరమన్నారు. సభకు పాఠశాల ప్రిన్సిపల్ విష్ణుభట్ల కృష్ణవేణి అధ్యక్షత వహిం చారు. సభలో రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి లూరి సాత్వికమోహన్ కర్ణాటక గాత్ర సంగీత కచేరి చేశారు. సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి, డాక్టర్ భూసురపల్లి వెంకటే శ్వర్లు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య తదితరులు ప్రసంగించారు. తొలుత పోడూరి భార్గవి, పోడూరి ఐశ్వర్య గాత్ర కచేరి చేశారు. అనంతరం సుప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు ఉప్పులూరి సాత్వికమోహన్ కర్ణాటక గాత్ర సంగీత కచేరి చేశారు.
.jpeg)


.jpeg)

.jpeg)



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి