రామాయణంపై ప్రవచనం
రామాయణం కిష్కింధకాండలో హనుమంతుడిని చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చని సుప్ర సిద్ధ ప్రవచనకర్త మల్లాది కైలాసనాథ్ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై మంగళవారం కిష్కింధకాండలోని ధర్మసూక్ష్మాలు అనే అంశంపై ఆయన మాట్లాడారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తా నయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్లాది కైలాసనాథ్ మాట్లాడుతూ కిష్కింధకాండలోనే హనుమంతుడి పరిచయం జరుగు తుందని, ఆయన మాటల ద్వారా కార్యం సానుకూలం చేయడం ఎలా అని పాఠకులకు సులువుగా తెలుస్తుందన్నారు. రామ, సుగ్రీవుల మైత్రికి ప్రధాన కారణం ఆంజనేయస్వామేనని ఆయన వివరించారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి