ఘనంగా సాయిశృతి మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ వేడుకలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయిశృతి మ్యూజిక్ అకాడమీ ఆర్. ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో 39వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గాత్రం, వయోలిన్, కీబోర్డు, తబల, డ్రమ్స్, వీణా, మృదంగంతో పాటు 12 రకాల వాయిద్యాలతో కచేరీలు నిర్వహించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమాలను ఎస్. రామారావు పర్యవేక్షించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి