ఘనంగా ముగిసిన నృత్య ప్రదర్శనలు
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అన్నమయ్య కళావేదికపై వారం రోజుల నుంచి శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ వారు నిర్వహిస్తున్న అంతర్జాతీయ నృత్య దినోత్సవాలు వైభవంగా ముగిసాయి. ముగింపు కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఉదయం నటరాజ స్వామి పూజ, నగర నాట్యచార్యులు నిర్వహించారు. అనంతరం నటరాజ స్వామికి నృత్య నివేదనగా శ్రీ గణపతిని సేవింప రారే అన్న త్యాగరాజ కీర్తనకి వంద మందికి పైగా నర్తకి మణులు నృత్యం చేశారు. సాయంత్రం జరిగిన సభకు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ఆత్మీయ అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగశ్రీ హరిత విచ్చేశారు. డాక్టర్ పీవీకే కుందనీక (తెలంగాణ) కథక్ నాట్యం, నిఖిత ఆంధ్ర నాట్యం, సరిపూడి అంకిత కూచిపూడి నాట్యంతో తమ ప్రతిభను చాటుకున్నారు. కళాకారులను సంస్థ కార్యదర్శి యువ కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహకరించిన వారందరికీ సంస్థ కోశాధికారి వెంకటగిరి నాగలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి