ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ గుంటూరు తిరుమలగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి 27వ వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా శనివారం ఉదయం నిత్యపూజలు, బృందావన శ్రీనివాసుని హనుమత్ వాహనం పై శోభా యాత్ర, తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వెంకట రంగనాయకి గోష్టి బృందంచే లలితా సహస్రనామ పారాయణ అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం నవగ్రహారాధన హోమం రుత్వికులు వేదమంత్రాలతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉపాధ్యక్షులు లంక విజయబాబు వారి ఆధ్వర్యంలో స్వామివారిని గరుడహనంపై వేషధారణలు, కోలాటాలు, డప్పులు విన్యాసాలతో అంగరంగవైభవంగా శోభాయమానంగా ఊరేగించారు. ఆధ్యాత్మిక సభా కార్యక్రమాలలో మధురవాక్ శిఖామణి ధనకుదరం సీతారామానుజాచార్య స్వామి, ప్రణవాశ్రమం కాకినాడ సుమిత్రానంద సరస్వతీ మాతాజీ పాల్గొని అనుగ్రహభాషణం చేశారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి