ఘనంగా డాక్టర్ నాగ భైరవ సాహిత్య పురస్కార ప్రదానం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అన్నమయ్య కళావేదికపై శతాధిక గ్రంథ రచయిత డాక్టర్ జీవీ పూర్ణచంద్కు నాగభైరవ సాహిత్య పురస్కార ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ జక్కంపూడి సీతారామారావు, ముఖ్య అతిథి ప్రపంచ తెలుగు సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు డాక్టర్ జీవీ పూర్ణచంద్కు నాగ భైరవ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ మోదగుల రవికృష్ణ సభా నిర్వహణ గావించిన ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఏఎన్యూ తెలుగు శాఖాధిపతి డాక్టర్ ఎన్వి కృష్ణారావు, యర్రగుంట్ల పాణిరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత మద్దిరాల ఆర్నవి చేసిన భక్తిరస నృత్యాలు ఆహుతులను అలరించాయి.

.jpeg)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి