రమణీయం... రాములోరి కల్యాణం
: సీతా కల్యాణ వైభోగ మే... రామ కల్యాణ వైభోగమే... సీతారామ కల్యాణ వైభోగమే అంటూ నగరంలో శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. చూసిన కనులదే భాగ్యం అన్నట్టుగా రాములోరి కల్యాణం నేత్రపర్వంగా జరి గింది. కల్యాణోత్సవాలతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయాల్లో వేకువజాము నుంచే స్వామి మూలవిరాట్కు అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా కొబ్బరి మట్టలు, అరటి బోదెలు, మామిడి తోరణాలు అలంక రించిన వేదికపై వేద పండితుల ఆధ్వర్యంలో దంపతులచే సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయాలు కిక్కిరిసాయి. నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ, వడపప్పు, పానకం అందజేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కల్యాణంలో పాల్గొని, స్వామి వారి ఆశీస్సులు పొందారు. మొత్తం మీద శ్రీరామనవమి వేడుకలు నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతూ శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచాయి. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ఆధ్వర్యంలో ఆలయ అర్చక బృందం శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. హారతి అనంతరం విశేషంగా పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. బ్రహ్మాశ్రీ నోరి నారాయణమూర్తి శ్రీరామ పట్టాభిషేకంపై ప్రవచనం చేశారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి