వైభవంగా శేష వాహన సేవ
బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్స వాల్లో భాగంగా శుక్రవారం వేంకటేశ్వర మహామంత్ర హోమం, లంకా విజయబాబు ఆధ్వర్యంలో స్వామికి శేషవాహన సేవ జరిగాయి. సభా కార్యక్రమాల్లో భువనేశ్వరి పీఠం కమలానందభారతి స్వామి, శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, యాబలూరి లోకనాథ నారాయణం శర్మ, నిర్వికల్పానందగిరి స్వామి, ప్రసాదాచార్యులు, ఎంవీ సత్యవతి ప్రసంగించారు. సభా కార్యక్రమానికి నోరి నారాయణమూర్తి అధ్యక్షత వహించారు. భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ పాల మండలి ఉపాధ్యక్షుడు సూర్యదేవర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి