బృందావన శ్రీనివాసుడి వార్షికోత్సవాలు ప్రారంభం
బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయం 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభా కార్యక్రమాన్ని ఆలయ పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. నోరి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో గండిపాలెం ఆనందాశ్రమం ప్రసన్నానందగిరిస్వామి, శృంగేరి విరూపాక్ష శ్రీపీఠం పీఠాధిపతి గంభీరానందభారతి మహాస్వామి, కారంచేడు వశిష్టాశ్రమ ఉత్తర పీఠాధిపతి విశ్వంభరానందగిరిస్వామి ప్రసంగించారు. డాక్టర్ నిమ్మల శేషయ్య, భాజపా నాయకురాలు యడ్లపాటి స్వరూపారాణి, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, మానం శ్రీనివాసరావు, కోగంటి వేంకట శ్రీరంగనాయకి పాల్గొన్నారు. వక్తలు బ్రహ్మోత్సవాల విశేషాలను వివరించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయచౌదరి, అడుసుమల్లి సుధాకర్, బండారు సాంబశివరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి