కేనోపనిషత్ పై ప్రవచనము
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం
అన్నమయ్య కళావేదికపై గురువారం జరుగుల బంగారుబాబు, శివకుమారి దంపతుల సౌజన్యంతో ఉపనిషత్
స్రవంతిలో కేనోపనిషత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు
సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి
కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ ప్రతి
ఆలోచన వెనుక, ప్రతి ఇంద్రియ చలనం వెనుక ఉన్న సాక్షి భూతమైన ఆత్మను గుర్తించడమే నిజమైన
జ్ఞానమని, దీని ద్వారానే మనిషికి అమరత్వం సిద్ధిస్తుందని ఇక్కడ వివరించబడిందన్నారు. మానవ
జన్మ లభించినప్పుడే ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని, ఈ జన్మలోనే దానిని
సాధిస్తేనే జీవితం ధన్యమౌతుందన్నారు. మహా వినాశనం తథ్యమని హెచ్చరిస్తూ, వివేకవంతులు
అన్నింటిలోనూ ఆ పరమాత్మను దర్శించి అమరులవుతారని ఈ అధ్యాయం సంక్షిప్తంగా
ప్రబోధిస్తుందన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి