అలరించిన నృత్య ప్రదర్శనలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై జరుగుతున్న 16వ అంతర్జాతీయ నృత్య వేడుకలు మూడోరోజుకు చేరుకున్నాయి. శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడమీ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలను శనివారం ఆలయ కమిటీ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా, మోదుగుల రవికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం థాయిలాండ్కు చెందిన పట్టారపోల్ తెంగురారాయ్ ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం, బెంగళూరుకు చెందిన కంచికాభట్ ప్రదర్శించిన యక్షగానం, ఒరిస్సాకు చెందిన గాయత్రి భూపతి ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం సంస్థ కార్యదర్శి డాక్టర్ కాజ వేంకట సుబ్రహ్మణ్యం కళాకారులను యువ కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి