పాట, పద్యంతో తెలుగు భాషకు ఔన్నత్యం
పద్యం, పాటతోనే తెలుగు భాష మరింత ఔన్నత్యాన్ని సంతరించుకుంటుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదు అన్నారు. స్థానిక బృందావన్గార్డెన్స్, అన్నమయ్య కళావేదికపై మంగళవారం పి.సత్యనారాయణ రాజు కళావేదిక ఆధ్వర్యంలో సూర్యకాంతం స్మారక పురస్కార ప్రదాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజరైన డొక్కా మాణిక్యవరప్రసాదు మాట్లాడుతూ, అనేక పాత్రలలో తెలుగు భాషకు సుర్యకాంతం వన్నె తెచ్చారని, ఆమె పురస్కారాన్ని పౌరాణిక నాటక బ్రహ్మ, పద్మశ్రీ యడ్ల గోపాలరావుకు అందజేయడం సముచితమని అన్నారు. అనంతరం మహాభారతంలోని పడక సీను నాటక ప్రదర్శన రసజ్ఞులను ఆలరించింది. ఈ కార్యక్రమానికి సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ అధ్యక్షత వహించగా, కార్యక్రమంలో పి.సత్యనారాయణ రాజు, లంకా విజయబాబు, డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, పసుపులేటి శ్రీధర్, సెట్లం చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి