మహా మంజీర నాదం వేడుకలు పారంభం
సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 16వ అంతర్జాతీయ నృత్య మహా మంజీర నాదం వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో ఈ వేడుకలను ఆలయ కమిటీ అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు భూసురపల్లి వెంకటేశ్వర్లు స్వాగతం పలకగా, సంస్థ కార్యదర్శి వ్యవస్థాపకులు కళా రత్న డాక్టర్ కాజ వేంకట సుబ్రహ్మణ్యం రచన నృత్య దర్శకత్వం వహించిన నాట్యద్భావం యక్షగానాన్ని ప్రదర్శిం చారు. భరతుడి నాట్య శాస్త్రానుసారం నాట్యత్పత్తి క్రమాన్ని ఈ నృత్య రూపంలో కూలం కషంగా వివరించారు. తాళ్లూరి ధరణి, నాగమహిత, అక్షయ, తోషిత, దర్ష, గాయత్రి, అనన్య ఆర్థవి, జోషిత, శ్రీ అనన్య, గోపిక, ఉమ మొదలైన 40 మంది కళాకారులు ప్రదర్శించిన ఈ నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమాన్ని వేంకటగిరి నాగలక్ష్మి, గరికపాటి శిరీష పర్యవేక్షించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి