సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...
మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో అన్నమయ్య కళావేదికపై సోమవారం మహాభారతం అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ పాలక మండలి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ల శ్రీకూర్మనాధస్వామి మాట్లాడుతూ మహాభారంతో అరణ్యపర్వం అత్యంత గొప్పగా వర్ణించబడిందన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి