కేనోపనిషత్ పై ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం, శ్రీ పద్మావతి కల్యాణవేదికపై సోమవారం జరుగుల బంగారుబాబు, శివకుమారి దంపతుల సౌజన్యంతో ఉపనిషత్ స్రవంతిలో కేనోపనిషత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ కేనోపనిషత్తులోని రెండో అధ్యాయం బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ఒక పరమ సత్యాన్ని ఎంతో గంభీరంగా వివరిస్తుందన్నారు. నేను బ్రహ్మమును పూర్తిగా తెలుసుకున్నాను అని ఎవరైనా భావిస్తే, వారు దాన్ని అసలు తెలుసుకోలేదని, ఎందుకంటే బ్రహ్మము అనేది బుద్ధికి, ఇంద్రియాలకు పరిమితమయ్యే వస్తువు కాదని ఈ అధ్యాయం స్పష్టం చేస్తుందన్నారు.






కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి