ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అలరించిన ఉత్తర గోగ్రహణం తోలుబొమ్మలాట - 14.05.2026

అలరించిన ఉత్తర గోగ్రహణం తోలుబొమ్మలాట స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదికపై గురువారం రాత్రి ఉత్తర గోగ్రహణం తోలు బొమ్మలాట ప్రదర్శించారు. గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ సౌజన్యంతో శ్రీషిర్డీసాయి తోలుబొమ్మలాట బృందం (నరసరావుపేట) కళాకారులు నిర్వహించగా, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, గుళ్ళపల్లి సుబ్బారావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. దుర్గారావు, కుమారి, వెంకటదాసు, నాగేశ్వరరావు, చిన్న, కోటేశ్వరి, సీతమ్మ, హనుమంతరావు, శివరా మకష్ణ, కమల్ బృందం మహాభారతంలోని పాండ వుల అజ్ఞాతవాసం, బృహన్నల నాట్య గురుత్వం, కౌరవుల కుట్ర, ఉత్తర కుమారుని ప్రజ్ఞలు, ఉత్తర గోగ్రహణం చేసిన కౌరవులను అర్జునుడు ఒక్కడే ఓడించడం తదితర ఘట్టాలను పద్యాలు, గేయాలు, వచనంతో ప్రదర్శించారు. ప్రేక్షకులను అలరించాయి. అనంతరం కళాకారులను గుళ్లపల్లి రాఘవేంద్రరావు సత్కరించారు.

రామానుజాచార్య జీవిత విశేషాలపై ఆధ్యాత్మిక ప్రవచనము - 22.04.2026

రామానుజాచార్య జీవిత విశేషాలపై ఆధ్యాత్మిక ప్రవచనము

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి సౌజన్యంతో శ్రీ భగవత్ రామానుజ తిరునక్షత్ర (జయంతి) మహోత్సవములు సందర్భంగా బుధవారం రామానుజాచార్య జీవిత విశేషాలు, యతిరాజ వింశతిపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్, మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యడ్లపాటి అశోక్ కుమార్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంత కర్తగా, గొప్ప సామాజిక విప్లవకారుడిగా భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోయారన్నారు. భగవంతుని చేరుకోవడానికి భక్తి, శరణాగతి మాత్రమే మార్గాలని బోధిస్తూ, కులమత భేదాలకు అతీతంగా అందరికీ మోక్షం లభించాలని ఆయన ఆకాంక్షించారన్నారు. సాహితీవేత్త కె.వి.ఎల్.ఎన్. అప్పలాచార్యులు ప్రవచిస్తూ యతిరాజ వింశతి అనేది శ్రీ రామానుజాచార్యుల వైభవాన్ని కొనియాడుతూ శ్రీ వరవరమునులు రచించిన ఒక విశిష్టమైన స్తోత్రమన్నారు. రామా సుజుల దయాగుణాన్ని, వారి జ్ఞాన వైభవాన్ని మరియు విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపనలో వారు చేసిన కృషిని కవి అత్యంత సుందరంగా వర్ణించారన్నారు. అసిస్టెంట్ సూపరెస్టెండెంట్ ఆఫ్ పోలీస్ ఎ.. హనుమంత్ ప్రసంగిస్తూ రామునికి అనుజుడు రామానుజుడున్నారు. పేదలందరికి దేవాలయ దర్శనం కల్పించాలని అన్నారన్నారు. వాక్కు విచక్షణా జ్ఞానం, పంచధర్మాలను ఎలా ఉపయోగించుకోవాలనేదే ధర్మమన్నారు.










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.