సుజనకు ఈమని శంకరశాస్త్రి పురస్కార ప్రదానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలోని శ్రీపద్మావతి కల్యాణ వేదిక, అన్నమయ్య కళావేదికపై రామరాజు ఫౌండేషన్, రామరాజు ఇన్ఫ్రాడెవెలపర్స్ ఆధ్వర్యంలో వీణా ఝరి కార్యక్రమాలను నిర్వ హించారు. ఫౌండేషన్ అధినేత డాక్టర్ రామరాజు శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆర్. లక్ష్మీశ్రీనివాస్, అయ్యగారి సత్యప్రసాద్ దంపతులు, డీవీఆర్ సీత, చిట్టా కార్తీక్, వి.లక్ష్మీగీత, కేఎస్ గోవిందరాజన్, కనకదుర్గ, వి.హరిప్రియలు శ్రావ్యంగా వాగ్గేయకారుల కీర్తనలను వీణలపై పలికించారు. ఈమని శంకరశాస్త్రి పురస్కార గ్రహీత ప్రముఖ వీణ విద్వాంసురాలు పారుపల్లి సుజనవీణ కచేరి అలరించింది. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ కె.లక్ష్మీనారాయణ, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వొలేటి పార్వతీశం, ప్రముఖ సంగీత సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, విజ్జేశ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వం శ్రీ రామరాజు పాల్గొనగా, పారుపల్లి సుజనకు ఈమని శంకరశాస్త్రి పురస్కార ప్రదానం చేసి సత్కరించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి