రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవా లయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై తితిదే ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి సౌజన్యంతో భగవద్రామానుజ తిరునక్షత్ర మహోత్సవాలు జరు గుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి గద్యత్రయం, భగవద్రామానుజుల భాష్యకార బిరుద వైశిష్టం అనే అంశంపై సభ జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నారాయణం శేషుబాబు మాట్లాడుతూ భగవద్రామానుజులు రచించిన 'గద్యత్రయం' విశిష్టాద్వైత సంప్రదాయంలో శరణాగతి తత్వాన్ని చాటిచెప్పే అత్యున్నత భక్తి ప్రబంధమన్నారు. ఎంవీ సత్యవతి మాట్లాడుతూ రామానుజులు తన గురువులఅజ్ఞను నెరవేరుస్తూ, బ్రహ్మసూత్రాలకు అద్భుతమైన వివరణతో శ్రీభాష్యం రచించారన్నారు.

.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి