యువ సంగీతరత్న బిరుదు ప్రదానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం రాత్రి గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో సోమయాజుల విష్ణుప్రియ గాత్ర కచేరి జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమాన్ని సంగీత విద్వాంసురాలు పాటిబండ్ల జానకి, కొంపెల్ల బీ.ఎన్.శర్మ, రామరాజు లక్ష్మీశ్రీనివాస్ జ్యోతి వెలిగించి ప్రారంభిం చారు. అనంతరం అతిథులు, నిర్వాహకులు సోమయాజుల విష్ణుప్రియకు గాయత్రీ యువ సంగీతరత్న బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. సంస్థ ప్రతినిధులు ఎంవై శేషురాణి, పాటిబండ లలితాదేవి, ఏవీ మంగాదేవి కళాకారులను, అతిధులను సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి