శ్రీ భక్త జ్ఞానానంద తీర్థ మెమోరియల్ పురస్కార ప్రదానం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి అధ్యక్షులు డాక్టర్ పి.విజయ ఆధ్వర్యంలో శనివారం శ్రీ భక్త జ్ఞానానంద తీర్థ 36వ ఆరాధన సంగీత మహోత్సవ సభ జరిగింది. ఆప్తమాలజిస్ట్ డాక్టర్ ఎం. శ్రీధర్, ఆత్మీయ అతిథిగా విశ్రాంత జియోఫిజిస్ట్ ఓగీరాల రామకృష్ణ పాల్గొనగా, కార్యక్ర మాలను గైనకాలజిస్ట్ డాక్టర్ సి. జ్యోతి కామ్ ప్రసాదు ప్రారంభించారు. అనంతరం ప్రముఖ కర్నాటిక సంగీత విద్వాంసురాలు, ప్రొఫెసర్ డాక్టర్ వీ.గౌరీ రామ్మోహన్ ను భక్త జ్ఞానానంద తీర్థ మెమోరియల్ పురస్కారం తో ఘనంగా సత్కరించారు. అనంతరం గౌరీ రామ్మోహన్ వారి గాత్ర సంగీత కచేరి వీనుల విందుగా గానం చేసి, సంగీతాభిమానులను అలరించారు. వీరికి వయోలిన్ పై హెచ్ రాంచరణ్, మృదంగంపై కే.అరవింద్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. అనంతరం కళాకారులను సన్మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి