రామానుజ తిరునక్షత్ర మహోత్సవాలు ప్రారంభం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై భగవద్రామాను భగవత్ రామానుజ తిరునక్షత్ర (జయంతి) మహోత్సవాలు సోమవారం మొదలయ్యాయి. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సౌజన్యంతో జరగ్గా, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ సంస్కృత పండితులు డీఎన్. దీక్షిత్ ప్రవచిస్తూ భగవద్రామానుజా చార్యులు అనుగ్రహించిన తొమ్మిది గ్రంథాలు విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూలస్తంభాలుగా నిలు స్తాయని అన్నారు. కుల మత భేదం లేకుండా భగవంతుని చేరువయ్యేందుకు ప్రపత్తి సంపూర్ణ శర ణాగతి అనే దివ్య మార్గాన్ని లోకానికి ప్రబోధించాయని అన్నారు. సాహితీవేత్త డాక్టర్ వేంకట కోగంటిశ్రీరంగనాయకి ప్రవచిస్తూ శ్రీభగవద్రామానుజ అష్టోత్తర శతనామ స్తోత్రం విశిష్టాద్వైత సంప్రదాయంలో అత్యంత మహిమాన్విత మైనదని అన్నారు. ఈ స్తోత్రం ప్రధానంగా రామా నుజాచార్యుల వారి 108 దివ్య నామాలను స్తుతిస్తూ, వారి అసాధారణ వ్యక్తిత్వాన్ని పాండిత్యాన్ని, సమాజానికి చేసిన ఉపకారాన్ని కొనియాడుతుందని అన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి