పలువురికి కళాదర్బార్ ఉగాది పురస్కారాలు ప్రదానం
స్థానిక బృందావన్గార్డెన్స్ లోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో అన్నమయ్య కళావే దికపై శుక్రవారం సాయంత్రం కళాదర్బార్ ఉగాది పురస్కారాల సభ నిర్వహించారు. కళాదర్బార్ వ్యవస్థాపకులు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో జరగ్గా, తొలుత ఆలయ అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. గాయకులు రసూల్బాబు, సుధీర్ బాబు, శైలజచే సినీ సంగీత విభావరి, మహంకాళి నాగలక్ష్మి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి (వైద్యం), టీవీ 9 న్యూస్ రీడర్ నేత్ర (టీవీ), సామినేని కోటేశ్వ రరావు (సామాజిక సేవా), శ్రావణ సంధ్య (సినీ/టీవీ), యోగిత (సంగీతం), మేకల మోహ నరావు (విద్య), కావూరు సత్యనారాయణ (నాటకం) లకు కళాదర్బార్ ఉగాది పురస్కారాలతో సత్కరించారు. మిర్చియార్డు చైర్మన్ కుర్రా అప్పా రావు హాజరై ప్రసంగించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి