సందేశం పంచిన 'సహన' నాటకం
బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావే దికపై కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాపరిషత్ 21వ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ప్రదర్శించిన 'సహన' నాటకం సందేశాత్మకంగా సాగి ప్రేక్ష కులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి పుట్టగుంట ప్రభాకరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు స్నిగ్ధ రచనకు, ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించిన సహన నాటకాన్ని ప్రదర్శించారు. న్యాయం కోసం నిజాయతీగా అన్యాయంపై తిరు గుబాటు చేసి అలసట లేని ప్రయాణం సాగించిన ఓ తండ్రీకూతుళ్ల కథ నాటక ఇతివృత్తం. ఎన్.రవీంద్రరెడ్డి, వి.సీహెచ్. కె. ప్రసాద్, పి. మీరయ్య, కె.రవికాంత్, లక్ష్మణశాస్త్రి, టి. శ్రీలేఖ, కుసుమ సాయి పాత్రోచితంగా నటించారు. పి.లీలామోహన్ సంగీతం అందించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు రామకృష్ణప్రసాద్ కాట్రగడ్డ, ఆర్. వెంకట్రావు, టి.సుబ్బారావు, ఎ.పాపారావు, ఎన్. శేషు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి