సంగీత పాఠశాల వార్షికోత్సవం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణం అన్నమయ్య కళావేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంసృతిక శాఖ రాష్ట్ర సృజనాత్మ కత, సంస్కృతి సమితి సౌజన్యంతో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల 54వ వార్షికోత్సవం శనివారం రాత్రి జరిగింది. తొలుత కార్యక్రమాన్ని ఆలయ పాలకమండలి అధ్యక్షుడు మస్తానయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సభలో రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఉపసంచాలకులు ధన్యాసి పెంచలయ్య, డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రిన్సిపల్ విష్ణుభట్ల కృష్ణవేణి తదితరులు ప్రసంగించారు. అనంతరం పాఠశాల విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శన, సంగీతం, వీణ, సన్నాయి వాద్య కచేరీలు జరిగాయి. కార్యక్రమాలను సురేష్ బాబు, పి. నందకుమార్, హరిబాబు తదితరులు పర్యవేక్షించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి