అజరామరమైన కవిత- పోతన భాగవతం
పోతన రచించిన ఆంధ్ర భాగవతం తెలుగు వారికి కానుక అజరామరమైన అని ప్రసిద్ధ సాహితీవేత్త కవి డాక్టర్ శ్రిష్టి చంద్రమౌళిశర్మ అన్నారు. తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి వర్ధంతి సందర్భంగా తుమ్మల కళాపీఠం ఆధ్వర్యంలో బృందావన్గార్డెన్స్ లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణ వేదికపై భాగవత సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. డాక్టర్ చంద్రమౌళీశర్మ జనరంజకంగా ప్రసంగించారు. అనంతరం పద్యపఠనం పోటీలో గెలుపొందిన శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల, జె.కె.సి. కళాశాల విద్యార్థులకు తుమ్మల కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ సూర్యదేవర రవికుమార్, పి.నాగసుశీల, వై. సూర్యనారాయణ, నాగేంద్రం ప్రసంగించారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి