నేత్రానందం నృత్యాభినయనం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అన్నమయ్య కళావేదికపై కేఆర్ కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళాపరిషత్ 21వ నాటకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, ఇది ప్రమాదానికి సంకేతం నాటకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కందుల చేతన శ్రావన్య, యర్రం సింధుజ, క్రొవ్విడి శ్రీలక్ష్మి తన్విలు పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమాల్ని సంస్థ నిర్వాహకులు కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాదు, బొప్పన నరసింహారావు (బుజ్జి), జి.మల్లికార్జునరావు తదితరులు పర్యవేక్షించారు.





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి