ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కేనోపనిషత్ పై ప్రవచనం - చిన్మయామిషన్ సువీరానందస్వామి - 22-25.06.2026

కేనోపనిషత్ పై ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం, శ్రీ పద్మావతి కల్యాణవేదికపై సోమవారం జరుగుల బంగారుబాబు, శివకుమారి దంపతుల సౌజన్యంతో ఉపనిషత్ స్రవంతిలో కేనోపనిషత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ కేనోపనిషత్తులోని రెండో అధ్యాయం బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ఒక పరమ సత్యాన్ని ఎంతో గంభీరంగా వివరిస్తుందన్నారు. నేను బ్రహ్మమును పూర్తిగా తెలుసుకున్నాను అని ఎవరైనా భావిస్తే, వారు దాన్ని అసలు తెలుసుకోలేదని, ఎందుకంటే బ్రహ్మము అనేది బుద్ధికి, ఇంద్రియాలకు పరిమితమయ్యే వస్తువు కాదని ఈ అధ్యాయం స్పష్టం చేస్తుందన్నారు.

ముగిసిన శ్రీసద్గురు కళానిలయం నాటకోత్సవాలు - 17.06.2026

ముగిసిన శ్రీసద్గురు కళానిలయం నాటకోత్సవాలు

స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, అన్నమయ్య కళావేదికపై శ్రీసద్గు రు కళానిలయం రజతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న నాటకోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్ని భారతీ ధార్మి క విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాధామాధవ రసరంజని నిర్వాహకులు, ఎస్.కె.ఖలీల్ శిష్య బృందం పలు కీర్తనలకు కూచి పూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. సభలో ప్రముఖ సినీరచయిత బుర్రా సాయిమాధవ్, కళా విపంచి కార్యదర్శి జి. మల్లికార్జునరావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహే శ్వరరావు, రంగస్థల నటులు వి.గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ రావు తదితరులు పాల్గొని ప్రముఖ రంగస్థల నటులు దర్శకులు పీవీఎన్ కృష్ణను ఘనంగా సత్కరించారు. అనంతరం హిందూకాలేజి వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్. దుర్గాప్రసాద్, అతిథులు, కళాకారులు బసవరాజు జయశంకర్ దంపతులను ఘనంగా సత్కరించారు. సభానంతరం శిష్ట్లా చంద్రశేఖర్ రచనకు కేవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన బహు రూపి నాటికను ప్రద ర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.









కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.