వైభవంగా నాటకోత్సవాలు
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై తెలుగు నాట కరంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో నాటకోత్సవాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు అధ్యక్షుడు డి. తిరుమలేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆడిటర్ పీవీ మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. డాక్టర్ నీరజ, ఏపీ స్టేట్ ఫిలిం టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాసనాయక్, న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, కట్టా వరలక్ష్మి, బొల్లేపల్లి శ్రీనివాసరావు, బొల్లేపల్లి శాంతి, సాగినేని శ్రీజ ప్రసంగించారు. తొలుత ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. నాటకోత్సవాల్లో భాగంగా ఆరాధన ఆర్ట్స్ అకాడమీ కళాకారులు గోవిందరాజుల నాగేశ్వరరావు రచనకు నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించిన 'సరిగమ పాప' హాస్య నాటిక ప్రదర్శితమైంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి