సుందరకాండ సప్తాహం ప్రారంభం
బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సుందరకాండ సప్తాహ పారాయణం ప్రారంభమైంది. ఈసందర్భంగా జరిగిన సభలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, డీఎస్పీ గోలి లక్ష్మయ్య, పావులూరి శ్రీనివాసరావు, బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఎం. ఎస్. రామారావు రచించిన సుందరకాండ మొదటి అధ్యాయంలోని శ్లోకా లను వెంపటి సత్యనారాయణ గానం చేశారు. ఆ గానాన్ని కవి, రచయిత అయినాల మల్లేశ్వ రరావు విశ్లేషించారు.

.jpeg)




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి