నలుడు దమయంతి మధ్య వారధిగా హంస
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం శృంగార నైషధంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి ప్రవచిస్తూ శ్రీనాథుడు రచించిన శృంగార నైషధంలో నల- దమయంతుల ప్రేమకథకు హంస ఒక కీలక దూతగా వ్యవహరిస్తుందని అన్నారు. నలుడు ఉద్యానవనంలో పట్టుకున్న ఒక అద్భుత హం సను చంపకుండా వదిలివేస్తాడని పేర్కొన్నారు. అం దుకు కృతజ్ఞతతో ఆ హంస దమయంతి అందాన్ని వర్ణిస్తుందన్నారు. నలునికి ఆమెపై ప్రేమను కలిగించి, రాయబారంతో వారి కలయికకు మార్గం సుగమం చేస్తుందని చెప్పారు. హంస వేడుకోలు, నలుని ఉదారత, నలుని ఉదారతకు ముగ్ధుడైన హంస, దమయంతి అందాన్ని, గుణాలను నలునికి వివరిస్తుందని తెలిపారు. హంస నలుడు, దమయంతి మధ్య ఒక సజీవ వారధిగా నిలిచి, వారి ప్రేమ వివాహానికి కారణమవుతుందని పేర్కొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి