ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తండ్రి విశిష్టతను చాటిన నాన్న నాటిక - 15.06.2026

తండ్రి విశిష్టతను చాటిన నాన్న నాటిక స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర నాటక అకాడమి సౌజన్యంతో శ్రీ సద్గురు కళానిలయం రజతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న నాటకోత్సవాల రెండో రోజు ఆదివారం ప్రదర్శించిన నాన్న నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత శ్రీ సత్యసాయి బడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ కొల్లా ధనలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బసవరాజు సిస్టర్స్ శ్రేష్ట, నైనికలు ప్రార్ధన గీతాన్ని ఆలపించారు. భరణి కూచిపూడి నృత్య కళాశాల నిర్వాహకులు నాట్యాచార్య పూల భరణి శిష్య బృందం, నాట్య చారిణి అనిత శ్రీ సత్యసాయి బడిల్ స్కూల్ విద్యార్థులు పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు కావూరి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సభలో రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు డాక్టర్ ఎన్. రవికుమార్, శ్రీ సత్య సాయి బడియల్ స్కూల్ కరస్పాండెంట్ కొల్లా శంకర్ కిషోర్ కుమార్, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబ...

ముగిసిన వైకే నాగేశ్వరరావు స్మారక నాటకోత్సవాలు - 16.05.2026

ముగిసిన వైకే నాగేశ్వరరావు స్మారక నాటకోత్సవాలు

స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేం కటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద కళా విపంచి, యువకళావాహిని సంయుక్త నిర్వహణలో వైకే నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న నాటకోత్సవాలు శనివారం రాత్రితో ముగిశాయి. చివరి రోజున చెరుకూరి సాంబశివరావు రచన దర్శకత్వాల్లో ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారు 'మంచి మనసులు' నాటికను ప్రదర్శించారు. తొలుత జరిగిన సభకు లంక లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. యడ్లపాడు వేదిక సంస్థ అధ్యక్షుడు ముత్తవరపు సురేష్ బాబు, మేకల మోహనరావు, డోగిపర్తి శంకరరావు, రామరాజు లక్ష్మీశ్రీనివాస్, ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమాలను ప్రారంభించారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన జి. మల్లికార్జునరావును కళావిపంచి అధ్యక్షుడు బొప్పన నరసింహారావు. పలు కళాసంస్థల వారు, స్నేహితులు, ఆలయ పాలకమండలి, పలువురు ప్రముఖులు జీవన సాఫల్య పురస్కారమిచ్చి సత్కరించారు. అనంతరం సూర్యలలిత యశస్వికి వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారమిచ్చి సత్కరించారు.










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.