తండ్రి విశిష్టతను చాటిన నాన్న నాటిక
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర నాటక అకాడమి సౌజన్యంతో శ్రీ సద్గురు కళానిలయం రజతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న నాటకోత్సవాల రెండో రోజు ఆదివారం ప్రదర్శించిన నాన్న నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత శ్రీ సత్యసాయి బడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ కొల్లా ధనలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బసవరాజు సిస్టర్స్ శ్రేష్ట, నైనికలు ప్రార్ధన గీతాన్ని ఆలపించారు. భరణి కూచిపూడి నృత్య కళాశాల నిర్వాహకులు నాట్యాచార్య పూల భరణి శిష్య బృందం, నాట్య చారిణి అనిత శ్రీ సత్యసాయి బడిల్ స్కూల్ విద్యార్థులు పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు కావూరి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సభలో రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు డాక్టర్ ఎన్. రవికుమార్, శ్రీ సత్య సాయి బడియల్ స్కూల్ కరస్పాండెంట్ కొల్లా శంకర్ కిషోర్ కుమార్, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, రంగస్థల నటుడు పమిడి కుమార శేఖర్ తదితరులు పాల్గొని ప్రముఖ ప్రముఖ మృదంగ విద్వాంసులు తిరునగరం ప్రభాకర్ రావు ను ఘనంగా సత్కరించారు. సభానంతరం మాడభూషి దివాకర బాబు రచనకు బసవరాజు జయశంకర్ దర్శకత్వం వహించిన నాన్న నాటికను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇందులో బసవరాజు జయశంకర్, ఎం సూర్య, డి వేణుగోపాల్ రెడ్డి, రూపాశ్రీ లు నటించారు. కీబోర్డుపై కె.. వి. రమణ, మృదంగంపై ప్రభల రమణ వాయిద్య సహకారం అందించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి