ప్రారంభమైన వైకే నాటకోత్సవాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కళావిపంచి, యువ కళావా హిని(హైదరాబాద్) సంయుక్తంగా రెండు రోజులపాటు నిర్వహిస్తున్న వైకే నాటకోత్సవాలు శుక్రవారం మొదలయ్యాయి. వైకే నాగేశ్వరరావు 77వ జయంతి సందర్భంగా నాటకోత్సవాలు నిర్వహించగా, అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కళావిపంచి గౌరవాధ్యక్షులు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, అంబటి మధుమోహన్, కలపత్రిక సం పాదకులు డాక్టర్ మహమ్మద్రఫీ, ఆలయ పాలక మండలి అధ్యక్షులు సిహెచ్. మస్తా నయ్య, కళాస్రవంతి అధ్యక్షులు డాక్టర్ దేవరప ల్లి ప్రభుదాస్ లు ప్రసంగించారు. కళావిపంచి అధ్యక్షులు బొప్పన నరసింహారావు, యువ కళావాహిని అధ్యక్షులు డాక్టర్ లంక లక్ష్మీనారా యణ, అతిధులు దొంతాల ప్రకాష్ను వైకే నాగేశ్వరరావు పురస్కారంతో సత్కరించారు. అనంతరం ధర్మరాజు దండయాత్ర నాటిక సందేశా త్మకంగా కొనసాగింది. కార్యక్రమంలో భాగీ శివశంకరశాస్త్రి, తిరుమలేశ్వరరావు, సయ్యద్ జానీబాషా, జీవీజీ శంకర్, నడింపల్లి వెంకటేశ్వరరావు, జి.మల్లికార్జున రావు, చిక్కం శ్రీనివాస్ పాల్గొనగా, అతిధులు, కళాకారులను సత్కరించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి