కనుల పండువగా శ్రీవారి కల్యాణం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై ఆదివారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. దేవాలయ పాలకమండలి సహకా రంతో పులివర్తి శేషగిరిరావు, సుధారాణి దంపతులతో ఆలయ అర్చకులు పరుచూరి మాధవస్వామి, పరాశరం కృష్ణకిశోర్, ముత్తేవి చిన్మయానంత శ్రీనివాసస్వామి, నల్లూరి సతీష్ స్వామిల ఆధ్వర్యంలో కల్యాణ క్రతువు జరిగింది. నారాయణం ప్రసాదాచార్యులు కల్యాణోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సంగీత విద్వాంసురాలు భువనేశ్వరి, నవ్య, రజిత బృందం భక్తి సంగీత విభావరి నిర్వహించారు. వెంకట్, తిన్నలూరి శ్రీహరిబాబు వాద్య సహకారం అందించారు.
.jpeg)
.jpeg)


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి